ఆసుపత్రిలో వాజపేయి

Update: 2018-06-11 09:13 GMT

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి అస్వస్థతగా ఉండటంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. ఈరోజు ఉదయం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వాజపేయిని ఎయిమ్స్ కు తరలించారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ధృవీకరించారు. 93 ఏళ్ల వాజపేయి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న వాజపేయి ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆయనకు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఎయిమ్స్ కు తరలించినట్లు బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది.

వైద్య నిపుణుల బృందం.....

వాజపేయికి ఎయిమ్స్ వైద్య నిపుణుడు, డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఒక టీం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయనకు అవసరమైన చికిత్స ను అందిస్తున్నారు. కాంగ్రెసేతర ప్రధానిగా ఐదేళ్లు పాలించిన ఘనత వాజ్ పేయిదే. ఆయనకు 2015లో ప్రభుత్వం భారతరత్న పురస్కారం అందచేసింది. పద్మ విభూషణ్ అవార్డు కూడా దక్కింది. ఆయనకు వివాదరహితుడిగా పేరుంది.

Similar News