వీడు పాన్ షాప్ ఓనర్ కాదు...కామపిశాచి

Update: 2018-06-09 02:01 GMT

ఫేస్ బుక్ రెక్వెస్ట్ పంపాడు... ఫ్రెండ్ షిప్ అన్నాడు.. యాక్సెప్ట్ చేసిన యువతిని దారుణంగా మోసగించాడు ఓ కామాంధుడు. పెళ్లి పేరిట సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి దగ్గరై ఆమె అశ్లీల వీడియోలు తీసాడు. యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. స్వీట్ పాన్ లో మత్తు పదార్ధాలు కలిపి ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపాడు. పెళ్లంటూ నిలదీసిన బాధితురాలిని, చివరకు తన మిత్రుల సహాయంతో శీల హననం చేసేందుకు ప్లాన్ వేశాడు. న్యాయం కోసం యువతి హైద్రాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో కటకటాలపాలయ్యాడు.

ఊరంతా కిళ్లీ షాపులే.....

అతడి పేరు ఉపేందర్ వర్మ. సన్ ఆఫ్ మహావీర్ ప్రసాద్ వర్మ. ఉండేది సిఖ్ విలేజ్ లో.. చేసేది పాన్ షాప్ బిజినెస్. హిమాయత్ నగర్ తో పాటు సిటీలోని పలు చోట్ల మయూరి పాన్ హౌస్ పేరిట పాన్ షాప్ లు నడుపుతున్నాడు. జల్సాగా గడిపే ఈ పాన్ వర్మ.. అదేనండి ఉపేందర్ వర్మ ఓ మిత్ర మండలిని ఏర్పాటు చేసుకొని ఫేస్ బుక్ రెక్వెస్ట్ లను పంపి అమ్మాయిలను ట్రాప్ లోకి దించుతాడు. హైద్రాబాద్ కాచిగూడలో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్ వెర్ ఉద్యోగినికి ఫేస్ బుక్ రెక్వెస్ట్ పంపిన ఉపేందర్, ఆమె నుంచి యాక్సెప్ట్ రావడంతో ఫ్రెండ్ షిప్ వల విసిరాడు. అందులో చిక్కుకున్న యువతిని పెళ్లి పేరిట పార్క్ ల చుట్టూ, హోటళ్ల చుట్టూ షికార్లు చేయించాడు. చనువు పెంచుకొని ఆమెకు దగ్గరయ్యాడు.

పెళ్లిమాట ఎత్తగానే......

ప్లాన్ వర్కౌట్ కాగానే ఆమె అశ్లీల వీడియోలు తీసాడు. పని పూర్తికాగానే అసలు ప్లాన్ బయటపెట్టాడు. తను చెప్పినట్లు వినాల్సిందేనని హుకుం జారీచేసాడు. తనను దిక్కరిస్తే వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. మైండ్ బ్లాంక్ అయిన అమ్మాయి తెరుకునేలోగానే స్వీట్ పాన్ లో మత్తు పదార్దాలు కలిపి ఆమె పై పలుమార్లు అత్యాచారం జరిపాడు. ఇంకెంతకాలం అని ప్రశ్నించిన యువతి పెళ్లి కోసం ఉపేందర్ ను గట్టిగా నిలదీసింది. దీంతో అసలు విషయం బయటపెట్టాడు హైటెక్ కిళ్లీ కొట్టు బిజినెస్ మెన్. తనకు ఇదివరకే ఓ రాజస్థానీ అమ్మాయితో పెళ్లయిందని, ఓ పాప కూడా ఉందని చెప్పాడు. ఖంగుతిన్న అమ్మాయి తన తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని చెప్పింది. వారు ఉపేందర్ ను నిలదీశారు. తన తండ్రి మహావీర్ ప్రసాద్ వర్మ బలవంతం మేరకే రాజస్థానీ యువతిని పెళ్లాడినట్లు, తనకు మొదటి భార్య అంటే ఇష్టం లేనట్లు నమ్మబలికాడు ఉపేందర్. తనకు కొద్ది సమయం ఇస్తే ఆమెకు విడాకులు ఇచ్చి తమ కూతుర్ని పెళ్లిచేసుకుంటానని వారికి తెలిపాడు.

నెలలు గడుస్తున్నా

నెలలు గడుస్తున్నా ఉపేందర్ పెళ్లి మాట ఎ త్తక పోవడంతో యువతి ఒత్తిడిని పెంచింది. తన మిత్రులు ఓం, ఆకాష్, మనీష్ తదితరుల సమక్షంలో 2017 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన యువతిని పెళ్లి చేసుకున్న ఉపేందర్.. తన సొంత కారులో మిత్రులతో కలిసి అమ్మాయిని గోవాలోని ఓ హోటల్ లో హనీమూన్ సందడి చేశాడు. ఆ తర్వాత అసలు పెళ్లి జరగలేదని బుకాయించిన ఉపేందర్, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని.. మిత్రుల సమక్షంలో "క్యారెక్టర్ అసాసినేషన్ " చేయడం ప్లాన్ ప్రకారం ప్రారంభించాడు. పెళ్లి మాట ఎత్తిన ప్రతి సారి అశ్లీల వీడియోలు చూపిస్తే తన స్నేహితులకు పంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అంటూ బెదిరిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించిన సదరు యువతి వీడియోలు, ఫోటోల, మెసేజ్ లు తదితర సాక్ష్యాధారాలతో కాచిగూడ పోలీసులను ఆశ్రయించి న్యాయం కోసం పిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన కాచిగూడ పోలీసులుఉపేందర్ ను అరెస్ట్ చేసి విచారించారు. పలు సెక్షన్ ల కింద కేసులను నమోదు చేసి అతడిని రిమాండ్ కు తరలించారు. ఉపేందర్ కు సహకరించిన మరో ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు.

Similar News