పాక్ కు మరో షాక్

పుల్వామాలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలనుకుంటున్న భారత్ ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఉగ్రదాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను నిషేదించాలనే భారత [more]

Update: 2019-02-28 06:19 GMT

పుల్వామాలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలనుకుంటున్న భారత్ ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఉగ్రదాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను నిషేదించాలనే భారత డిమాండ్ కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మద్దతు తెలిపాయి. ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ విషయమై సమావేశం జరిగింది. పుల్వామా ఉగ్రదాడిని వివిధ దేశాల్లో ముక్తకంఠంతో ఖండించాయి. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఆస్తులు సీజ్ చేయాలని ఆయా దేశాలు కోరాయి. మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని అమెరికా డిమాండ్ చేసింది. అతడిని విదేశాలకు వెళ్లకుండా నిషేదించాలని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా డిమాండ్ చేసింది.

Tags:    

Similar News