అరెస్ట్ కు రెడీ అయిపోయారా?

గరుడ పురాణం హీరో శివాజీ అరెస్టుకు రంగం సిద్ధమయింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. అజ్ఞాతంలో ఉండి వీడియో రిలీజ్ చేసిన శివాజీ [more]

Update: 2019-05-19 12:52 GMT

గరుడ పురాణం హీరో శివాజీ అరెస్టుకు రంగం సిద్ధమయింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. అజ్ఞాతంలో ఉండి వీడియో రిలీజ్ చేసిన శివాజీ పై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చినా ఇప్పటికీ పట్టించుకోకుండా తిరుగుతున్న శివాజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. టీవీ9 రవిప్రకాష్, సినీనటుడు శివాజీల మధ్యకుదిరిన షేర్ల ఒప్పందంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రెండుసార్లు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినా వారు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. అంతేకాకుండాతనకు పదిరోజులు సమయం కావాలని, వడదెబ్బ తగిలిందని పోలీసులకు శివాజీ ఈమెయిల్ చేశారు. ఈ మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా శివాజీ ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేశారు. అలాగే రవిప్రకాష్ ఆచూకీని కనుక్కునేందుకు నాలుగు పోలీసు బృందాలు ఇప్పటికే గాలిస్తున్నాయి.

Tags:    

Similar News