వారి తర్వాత కేసీఆరే..!

2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ కేసీఆర్ వద్దే ఉండటంతో ఆయనే బడ్జెట్ ను [more]

Update: 2019-02-22 08:33 GMT

2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ కేసీఆర్ వద్దే ఉండటంతో ఆయనే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అరుదు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గతంలో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న బెజవాడ గోపాల్ రెడ్డి 1955-56 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి 1968, 1969లో రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చివరగా వైఎస్ మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య 2011లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు తెలంగాణలో మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం.

Tags:    

Similar News