ఐదు ఒప్పందాలు చేసుకున్నాం

రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై కలసి పోరాడాలని నిర్ణయించామన్నారు. సహజ వాయు రంగంలో ఒప్పందం చేసుకుంటున్నామని [more]

Update: 2020-02-25 08:29 GMT

రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై కలసి పోరాడాలని నిర్ణయించామన్నారు. సహజ వాయు రంగంలో ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. ఇస్లాం తీవ్రవాదాన్ని అణిచి వేస్తామని చెప్పారు. టూర్ తాను ఎప్పటికీ మరచి పోలేనని చెప్పారు. ఇండియాతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు. భారత్ తో ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ట్రంప్ తెలిపారు. మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందని ట్రంప్ తెలిపారు. 5జి నెట్ వర్క్ పై కూడా చర్చించామన్నారు. తాను అధ్యక్షుడిని అయ్యాక భారత్ తో ఆర్థిక సంబంధాలు మరింత పెరిగిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. తిరిగి సాయంత్రం 5గంటలకు మరోసారి మీడియాతో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం ట్రంప్, మోడీలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.

మరింత మెరుగుపడతాయి : మోడీ

దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యకత్ం చేశారు. దైత్య సంబంధాల్లో రక్షణ సహకరాం కీలకమైందన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాలపై ఇరువురం చర్చించామన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించామని చెప్పారు. శాస్త్ర , సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని మోడీ తెలిపారు. ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంధన సహకారం గురించి ప్రత్యేకంగా చర్చించామన్నారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతాయని చెప్పారు. ట్రంప్ తో తనకు ఎనిమిదో సమావేశామని మోడీ తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరిగాయన్నారు. రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చబోతున్నామని మోడీ తెలిపారు. భారత్ – అమెరికా సంబంధాలకు ప్రభుత్వాలతో సంబంధం లేదన్నారు.

Tags:    

Similar News