రైతు సంఘాలతో నేడు కేంద్ర ప్రభుత్వం

నేడు రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయనుంది. ఈరోజు మధ్యాహ్నం విజ్ఞాన్ భవన్ లో రైతు నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. నాలుగు [more]

Update: 2020-12-30 03:51 GMT

నేడు రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయనుంది. ఈరోజు మధ్యాహ్నం విజ్ఞాన్ భవన్ లో రైతు నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. నాలుగు అంశాల అజెండాను రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. మద్దతు ధరపై లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. గత కొద్ది రోజుల్లోగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రద్దుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అంగీకరిచడం లేదు. సవరణలకు ఓకే అంటుంది. దీంతో ఈరోజు జరగనున్న చర్చలు పురోగతి ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News