తిరుమలపై హైకోర్టులో విచారణ...

Update: 2018-07-03 08:08 GMT

తిరుమలలో నగలు మాయం , గుడి లోపల తొవ్వకాల, పురాతన నిర్మాణాలను కాపాడాలని దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమలలో ఆరోపణలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు...మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించింది. గుడి లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని పిటీషనర్ కోర్టుకు తెలపగా, ఎలాంటి తవ్వకాలు జరపలేదని గుడిలో కేవలం కొన్ని మరమ్మత్తులు మాత్రమే జరిపామని టీటీడీ కోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మిస్తున్న గుడి గోపురం బంగారం కాదని పిటిషనర్ వాదించగా, ఇప్పుడు చేపడుతున్న నిర్మాణంలో బంగారం వాడుతున్నామని కోర్టుకు టీటీడీ తెలిపింది. తిరుమల లో జరుగుతున్న అక్రమాల పై న్యూస్ పేపర్ లో వచ్చిన కథనాలను పిటీషనర్ కోర్టుకు సమర్పించారు. అయితే, సుప్రీంకోర్టు జడ్జ్ మెంట్ ప్రకారం పత్రికల్లో వచ్చిన ఆరోపణలు కోర్టు పరిగణించడం జరగదని హైకోర్టు స్పష్టం చేసింది.

Similar News