ఇమ్రాన్ చెప్పిందే జరుగుతుందా….?

భారత్ లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. నిన్న ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రధాని నరేంద్రమోడీ హుందాగా  ప్రసంగించగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం భారత్ ను దుమ్మెత్తిపోశారు. [more]

Update: 2019-09-28 10:57 GMT

భారత్ లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. నిన్న ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రధాని నరేంద్రమోడీ హుందాగా ప్రసంగించగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం భారత్ ను దుమ్మెత్తిపోశారు. భారత్ పై విషం కక్కారు. కశ్మీర్ లో రక్తపాతం చూస్తారంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే కశ్మీర్ లో ఇవాళ ఉదయం సమయంలో కర్వ్యూ సడలించడంతోనే అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

చొరబాటు…..

కశ్మీర్ లో కర్వ్యూ సడలింపు జరగగానే ఉగ్రవాదులు చొరబడ్డారు. ఓ ఇంట్లోకి దూరి ఆ కుటుంబసభ్యులను బందీ చేశారు. దీంతో భారత్ ఆర్మీ దళాలు వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ ఇంట్లోని సభ్యులను రక్షించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. అక్కడ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

సెర్చ్ ఆపరేషన్……

ఉగ్రవాదులు మరో సారి టార్గెట్ చేశారు. కశ్మీర్ లో 370 ఆర్టికల్ ను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటినుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కశ్మీర్ లోని రాంబన్ లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. వెంటనే బలగాలు అక్కడికి చేరుకున్నాయి. టెర్రరిస్టులు ఓ ఇంట్లో దాగి ఉన్నారని తెలియడంతోనే ఆ ఇంటిని మిలటరీ దళాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాల్లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.

ఇంటెలిజెన్స్ హెచ్చరికలు…..

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించిన 24 గంటల్లోనే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడడంతో అన్ని రాష్ట్రాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ప్రతినిధుల సభలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.

 

Tags:    

Similar News