కేబినెట్ ఆమోదంపై టీడీపీ రెస్పాన్స్

ప్రజా వ్యతిరేక నిర్ణయాలను శాసనమండలిని అడ్డుకుంటుందనే జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని టీడీపీ ఆరోపించింది. అయితే మండలి పూర్తి స్థాయిలో రద్దు కావడానికి చాలా సమయం పడుతుందని [more]

Update: 2020-01-27 05:02 GMT

ప్రజా వ్యతిరేక నిర్ణయాలను శాసనమండలిని అడ్డుకుంటుందనే జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని టీడీపీ ఆరోపించింది. అయితే మండలి పూర్తి స్థాయిలో రద్దు కావడానికి చాలా సమయం పడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. కనీసం బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయకుండానే శాసనమండలిలో తీర్మానం చేయడమేంటని ప్రశ్నించారు. శాసనమండలిలో జరిగిన విషయాలను అసెంబ్లీలో చర్చించే అధికారం లేదన్నారు. ఈమేరకు టీడీఎల్పీ నేతలు గవర్నర్, స్పీకర్ కు లేఖ రాశారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ లో శాసనమండలి రద్దు అంశం చర్చించకుండానే తీర్మానం చేయడమేంటన్నారు. శాననమండలి రద్దయ్యేంతవరకూ సెలెక్ట్ కమిటీ లైవ్ లోనే ఉంటుందన్నారు. జగన్ తమ పార్టీపై అక్కసుతోనే శాసనమండలిని రద్దు చేశారన్నారు.

Tags:    

Similar News