కేసీఆర్ కు మహారాష్ట్ర రైతుల బంపర్ ఆఫర్

Update: 2018-05-21 14:01 GMT

తాము మహారాష్ట్రలో ఉండమని, మా గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని పలు మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి రూ.8 వేల పంట పెట్టుబడి అందించడం, 24 గంటల విద్యుత్, రైతులకు భీమా వంటి పథకాలు అమలవుతున్నాయి. అయితే తెలంగాణ సరిహద్దుకు ఆనుకుని ఉన్న పలు మహారాష్ట్ర గ్రామాల ప్రజలు ఈ పథకాలకు ఆకర్షితులయ్యారు. మమ్మల్ని కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకాలోని పలు గ్రామాల ప్రజలు ఈ మేరకు కోరుతున్నారు. ధర్మాబాద్ తాలుకా సర్పంచ్ లసంఘం అధ్యక్షుడు ఈ మేరకు ఇటీవల జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవితకు ఓ వినతిపత్రం కూడా అందజేశారు. కాగా, ఈ గ్రామాలన్నీ గతంలో నిజాం హైదరాబాద్ సంస్థానంలోనే ఉండేవి. అయితే, వీరి వినతిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

Similar News