ప్రొఫెసర్ పార్టీ మేనిఫెస్టోలో కీ పాయింట్స్ ఇవే..!

Update: 2018-11-05 07:29 GMT

ఉద్యమకారులు, అమరుల ఆకాంక్షలను అమలు చేయడమే తమ అజెండా అని తెలంగాణ జన సమితి ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. సోమవారం ఆయన జన సమితి 27 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు...

- అందరికీ ఉచిత విద్యా, వైద్యం

- రైతులకు రెండు లక్షల రుణ మాఫీ

- అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ, ప్రతీయేట ఉద్యోగాల భర్తీ క్యాలెండర్

- ఎస్సీ వర్గీకరణకు మద్దతు

- నిరుద్యోగులకు ఉద్యోగం లభించే వరకు రూ.3000 నిరుద్యోగ భృతి

- 100 రోజుల్లో ఉద్యమకారులపై ఉద్యమ కేసుల ఎత్తివేత

- హైదరాబాద్ లో అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు

- కౌలు రైతులకు కూడా అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధి

- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం

- ధర్మాచౌక్ పునరుద్ధరణ

- తెలంగాణ మ్యూజియంగా ప్రగతి భవన్

- కాంట్రాక్టులపై, నయీం కేసు, మియాపూర్ భూకుంభకోణాలపై రాజకీయ ప్రమేయం లేకుండా న్యాయ విచారణ.

- 2016 భూసేకరణ చట్టం రద్దు చేసి 2013 భూసేకరణ చట్టం అమలు.

- ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును రద్దు.

- ఉమ్మడి హైకోర్టు విభజనకు కృషి

- అవినీతి నిర్మూలన కోసం లోక్ పాల్, లోకాయుక్త, ఆర్టీఐ చట్టాల బలోపేతం

- అన్ని జీఓలు తెలుగు భాషలో

- ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆంగ్ల విద్యా బోధన

- పట్టణాలు, నగరాల్లో పేదల కోసం బస్తీ క్లినిక్ ల ఏర్పాటు

- రైతు విత్తనం వేసే సమయంలోనే కనీస మద్దతు ధర ప్రకటన

- రూ.3000 కోట్లతో ధరల స్తిరీకరణ నిధి ఏర్పాటు

- గ్రామాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల సహాయం

- పట్ణణాలు, నగరాల్లో పేదలు, మధ్య తరగతి వారికి శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి హౌజింగ్ బోర్డు ఏర్పాటుచేసి తక్కువ ధరలకు రుణాలు.

Similar News