ఏబీ టీడీపీ కోసం పని చేసేవారు

ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థను చంద్రబాబుకు ప్రైవేటు ఇంటెలిజెన్స్ లా ఏబీ వెంకటేశ్వరరావు మార్చారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడంపై స్పందించిన [more]

Update: 2019-03-27 07:01 GMT

ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థను చంద్రబాబుకు ప్రైవేటు ఇంటెలిజెన్స్ లా ఏబీ వెంకటేశ్వరరావు మార్చారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ… వెంకటేశ్వరరావు ప్రతీ రోజు లా ఆండ్ ఆర్డర్ కంటే ఎక్కువగా రాజకీయలపైనే చంద్రబాబుకు బ్రీఫ్ చేసేవారని అన్నారు. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలని, టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలో కూడా వెంకటేశ్వరరావు సలహాలు ఇచ్చేవారని అన్నారు. ప్రతిక్షణం ముఖ్యమంత్రి పక్కనే ఉండేవరని, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ముఖ్యమంత్రి వద్దే ఉండేవారన్నారు. అధికారులను వాడుకోవడం, స్వంత సామాజకవర్గం వారిని కీలక పదవుల్లో పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. వెంకటేశ్వరరావుపై చర్య తీసుకోవడం మంచి పరిణామమన్నారు.

Tags:    

Similar News