ఇంకా సస్పెన్సే

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఇవ్వాళ అర్థరాత్రితో కార్మిక నేతలు ఇచ్చిన డెడ్ లైన్ [more]

Update: 2019-10-04 06:54 GMT

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఇవ్వాళ అర్థరాత్రితో కార్మిక నేతలు ఇచ్చిన డెడ్ లైన్ సమీపిస్తుంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కార్మిక నేతలతో చర్చలు జరిపింది. కాని ఈ చర్చలు ఫలించలేదు. దీంతో మరో సారి ఇవ్వాళ జేఏసీ నేతలతో చర్చలకు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఏమైనా మాకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తే సమ్మెను విరమించుకుంటామని జేఏసీ నేతలు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయం ఏర్పాట్లు…..

మరోవైపు ప్రభుత్వం మాత్రం పండగ సీజన్ లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు బస్సులను, పాఠశాలల, కళాశాలల బస్సులను తాత్కాలిక పరిమిట్లతో నడపాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు డ్రైవర్ కు రోజుకు రూ.1500, కండక్టర్ కు రూ.1000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

మొదలైన ప్రభావం…..

ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు బ్యాడ్జీలు పెట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సమ్మె సమయంలో తాత్కాలికంగా బస్సులను నడిపేందుకు కొందరు ప్రైవేటు డ్రైవర్లు డిపో మేనేజర్లను కలుస్తున్నారు. వచ్చిన వారితో ఆర్టీసీ సిబ్బంది మా బాధలను అర్థం చేసుకోవాలని విన్నవిస్తున్నారు. ఆర్టీసీలో 9వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఈ సమయం దాటితే ఆ ఉద్యోగాలు కూడా భర్తీకావని చెబుుతున్నారు. కొందరు సిబ్బంది విధులకు హాజరు కాకుండా డిపోల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమ్మె ప్రభావం మొదలైంది. ప్రయాణికులు కూడా మా సమ్మెకు సహకరించాలని కోరుతున్నారు.

 

 

Tags:    

Similar News