కేంద్రంపై సుప్రీం సీరియస్

Update: 2018-04-09 07:56 GMT

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కావేరీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని తాము ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కావేరీ జలాలపై బోర్డును ఏర్పాటు చేయలంటూ సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. గతనెల ఏప్రిల్ 29వ తేదీలోగా బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈరోజు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెంటనే కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కావేరీ బోర్డు ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నానుస్తూ వస్తుంది. అయితే తాజా సుప్రీంకోర్టు అక్షింతలతో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Similar News