బిగ్ బ్రేకింగ్ : సుజనా ఆస్తులపై సీబీఐ దాడులు….??

తెలుగుదేశం పార్టీ నేతలపై మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు జరిగిన దాడులు ముగిసిపోయాయనుకుంటున్న తరుణంలో మరోసారిసీబీఐ, ఈడీలు తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తులపై సీబీఐ, ఈడీలు [more]

Update: 2019-06-01 09:48 GMT

తెలుగుదేశం పార్టీ నేతలపై మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు జరిగిన దాడులు ముగిసిపోయాయనుకుంటున్న తరుణంలో మరోసారిసీబీఐ, ఈడీలు తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తులపై సీబీఐ, ఈడీలు దాడులు జరుపుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆఫీస్ పై సిబిఐ సోదాలు జరగుతున్నాయి. హైదరాబాదులో మూడు చోట్ల సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో బెస్ట్ అండ్ కౌంటర్ పేరుతో వ్యాపారాన్ని సుజనా చౌదరి నిర్వహిస్తున్నారు. గతంలోనే ఈడి తో పాటు సిబిఐ సుజనా చౌదరి కంపెనీలపై కేసు నమోదు చేసింది. మాజీ సిబిఐ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ నేత విజయరామారావ్ కుమారుడితో కలిసి సుజనా చౌదరి వ్యాపారం చేశారు. చెన్నైలెపి ఒర జాతీయ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు నమోదు చేశారు. బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో తీసుకున్న రుణాలన్నింటినీ అక్రమంగా సుజనా చౌదరి కంపెనీకి బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే దీనిపై మనీలాండరింగ్ కేసును సీబీఐ నమోదు చేసింది.

Tags:    

Similar News