త్వరలోనే కేంద్రం నిర్ణయం

పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని, కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయడం ఆందోళనకర [more]

Update: 2019-08-03 14:16 GMT

పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని, కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయడం ఆందోళనకర పరిణామమన్నారు. ఏపీలోజరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆశ్చర్యం, ఆందోళన కల్గిస్తున్నాయన్నారు. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు సుజనా చౌదరి. వైఎస్ జగన్ వ్యక్తిగత కక్షతోనే పోలవరం పనులను రద్దు చేసిందని అనుమానాలు వస్తున్నాయన్నారు. సోమవారం పోలవరంపై సమీక్షను కేంద్రం జరుపుతుందన్నారు. ఇలా గత ప్రభుత్వం ఇచ్చిన పనులను రద్దు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని సుజనా చౌదరి చెప్పారు. తాను వ్యక్తిగతంగానో, రాజకీయంగానో ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, రాష్ట్రాభివృద్ధి కోసమే చేస్తున్నానని సుజనా చౌదరి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారని, ఇప్పుడు అధికారులు అలాటి నివేదికను ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు సుజనా చౌదరి.

Tags:    

Similar News