పదహేను సెకన్ల వీడియో చూశారా?

ట్వీట్టర్ లో కర్నూలు జిల్లాకు చెందని ఒక మహిళ పెట్టిన పదిహేను సెకన్లు వీడియో హల్ చల్ చేస్తుంది. 15 సెకన్లు వీడియో ఏకంగా లక్షల మంది [more]

Update: 2019-12-09 01:41 GMT

ట్వీట్టర్ లో కర్నూలు జిల్లాకు చెందని ఒక మహిళ పెట్టిన పదిహేను సెకన్లు వీడియో హల్ చల్ చేస్తుంది. 15 సెకన్లు వీడియో ఏకంగా లక్షల మంది షేర్ చేశారు. రీట్వీట్ చేశారు. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి హాష్‌ ట్యాగ్ చేస్తున్నారు. ఒక్క గంటల్లోనే లక్షల మంది ట్వీట్లు చేశారు.. కొన్ని గంటల్లోనే వీడియో మొత్తం వైరల్ గా మారింది. సుగాలికి న్యాయం చేయాలని తల్లి చేసిన ట్వీట్ ఇప్పడు ట్వీట్టర్ ను ఊపేస్తుంది. దిశ కేసు ఏవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెడింగ్ లోకి వచ్చిందో? ఈ వార్త కూడా కొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతేగాకుండా దిశకు న్యాయం చేసిన విధంగా తన బిడ్డకు న్యాయం చేయాలని ఆ తల్లి కోరింది. కర్నూలులో ఒక స్కూల్ తన బిడ్డను అత్యాచారం చేసి చంపారని .. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని ట్వీట్టర్ లో పదిహెను సెకన్లు వీడియోను తల్లి పోస్టు చేసింది. ఇప్పడు ఇది ట్వీట్టర్ ఇదే హాట్ టాపిక్ గా మారింది.

యజమాని కుమారులే…

కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న ఒక రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతుంది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం పేర్కొంది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ అధినేత కొడుకులు బలవంతంగా రేప్‌ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.

వైద్యుల నివేదికలోనూ….

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ శంకర్‌ , 20 ఆగస్టు 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో సైతం అమ్మాయిని రేప్‌ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ జి.బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 21 ఆగస్టు 2017న నివేదిక ఇచ్చారని తల్లి దండ్రులు తెలిపారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి స్కూల్‌ అధినేత తో పాటుగా కుమారులు లపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు సెక్షన్‌ 302, 201, ఫోక్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సంఘటనపై విచారణకు కలెక్టర్‌ ముందుగా త్రి సభ్య కమిటీని, ఆ తరువాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి..హత్య చేశారని ఈ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాన్ని చూసి వారికి అనుమానం వచ్చింది.

టాప్ ట్రెండింగ్ లోకి….

తమ బిడ్డను అత్యాచారం చేసి చంపారంటూ అదే రోజు కలెక్టరేట్‌ దగ్గర ఆందోళనకు దిగారు. పోస్టుమార్టంలో సైతం ఇదే విషయం తేలిందని కుటుంబ సభ్యులు తెలిపారు.. అయితే ఇప్పటి వరకు తమకు న్యాయం జరుగలేదని , తమకు న్యాయం చేయాలని ట్విట్టర్ లో పదిహేను సెకన్ల వీడియోను తల్లి పొస్ట్ చేసింది. ఇది కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. అంతేగాకుండా ట్వీట్టర్ లో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది

Tags:    

Similar News