సడలింపుల వల్లనే పెరుగుతున్నాయా?

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే 3,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో ఎ్నడూ ఒక్కరోజులో ఇంత సంఖ్యలో కేసులు [more]

Update: 2020-05-06 03:07 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే 3,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో ఎ్నడూ ఒక్కరోజులో ఇంత సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. గత పదిహేను రోజుల్లో ఇదే అత్యధిక కేసులు నమోదయిన తేదీగా పేర్కొనవచ్చు. అయితే లాక్ డౌన్ లో సడలింపుల కారణంగా కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. లాక్ డౌన్ సడలింపుల కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువయితే వెంటనే మినహాయింపులను రద్దు చేయాలన్న యోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకూ భారత్ లో 46,711 కేసులు నమోయ్యాయి. 1583 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Tags:    

Similar News