బ్రేకింగ్: డేటా చోరీ కేసు విచారణకు సిట్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాల చోరీ వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. [more]

Update: 2019-03-06 13:14 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాల చోరీ వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పలు సంచలన కేసులను విచారించిన చరిత్ర ఉన్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ లో ముగ్గురు ఐపీఎస్ లు, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను నియమించారు. నేరుగా డీజీపీ కార్యాలయం నుంచే ఈ కేసు విచారణ పర్యవేక్షించాలని పోలీసులు భావిస్తున్నారు. కేసు రెండు కమిషనరేట్ల పరిధిలో నమోదైనందున సమన్వయం కోసం సిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News