బీహార్ కు బయలుదేరిన రెండో రైలు

హైదరాబాద్ నుంచి వలస కార్మికుల తో రెండవ ట్రైన్ బయలుదేరింది. హైదరాబాద్ నుంచి పాట్నా కు ఈ ట్రైన్ ఇవాళ ఉదయం వెళ్లిపోయింది. మేడ్చల్ జిల్లా పరిధిలో [more]

Update: 2020-05-05 03:43 GMT

హైదరాబాద్ నుంచి వలస కార్మికుల తో రెండవ ట్రైన్ బయలుదేరింది. హైదరాబాద్ నుంచి పాట్నా కు ఈ ట్రైన్ ఇవాళ ఉదయం వెళ్లిపోయింది. మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న వలస కార్మికులు ఈ మేరకు అధికారులు పంపించివేశారు. శ్రామిక్ రైల్ పేరుతో కేంద్రం ప్రభుత్వం నడుపుతున్న ఈ ట్రైన్ లో 1250 మంది వలస కార్మికులు అధికారులు పంపించివేశారు. ఉదయం 3 గంటల 20 నిమిషాల సమయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కార్మికులందరికీ కూడా పంపించడం జరిగింది. మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా గత రెండు రోజుల నుంచి కూడా వివిధ పోలీస్స్టేషన్లలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పేర్లను నమోదు చేసుకున్న వారందరూ కూడా కుషాయిగూడ పరిధి లోకి రమ్మన్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వీరందరినీ కూడా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ కి చేర్చారు.

అందరికీ వైద్య పరీక్షలు…..

అర్ధరాత్రి 12 గంటల నుంచి మూడు గంటల వరకు కార్మికులందరికీ కూడా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు. అక్కడ సామాజిక దూరాన్ని పాటిస్తూ అందరిని కూడా నిలబెట్టారు. మూడు గంటల సమయంలో శ్రామిక్ రైల్ వచ్చింది.ఈ ట్రైన్ లో అందరిని కూడా సామాజిక దూరం పాటిస్తూ కుర్చో బెట్టారు. ఆ తర్వాత మూడు గంటల 20 నిమిషాలకు ట్రైన్ బయలుదేరింది. కార్మికులు వెళ్తున్న సమయంలో అధికారులు అందరూ చప్పట్లు కొట్టి వారికి వీడ్కోలు పలికారు.వలస కార్మికుల అందర్నీ ఘట్కేసర్ రైల్వే స్టేషన్ కు చేర్చేందుకు ఉన్నతాధికారులు పూర్తిగా పర్యవేక్షించారు. అయితే అత్యంత గోప్యంగా వ్యవహారం నడిచింది. వలస కార్మికులు అందరూ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News