ప్రజల ప్రాణాలకంటే ఎక్కువా? మూసేస్తే తప్పేంటి?

అమర్ రాజా బ్యాటరీస్ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే దానిని మూసివేయడంలో తప్పేంటని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు [more]

Update: 2021-08-04 04:15 GMT

అమర్ రాజా బ్యాటరీస్ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే దానిని మూసివేయడంలో తప్పేంటని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తనిఖీల్లో కాలుష్యం ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అక్కడి ప్రజలకు పరీక్షలు నిర్వహించగా శరీరంలో సీసం శాతం ఎక్కువగా ఉందని తేలిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. హైకోర్టు కూడా అమరారాజా బ్యాటరీస్ అవలంబిస్తున్న విధానాన్ని తప్పు పట్టిందన్నారు. ఇది కక్ష సాధింపు చర్య కాదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆ స్థానంలో వైసీపీ నేతల పరిశ్రమలున్నా జగన్ మూసివేయించేవారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలకంటే పరిశ్రమలు ఎక్కువ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Tags:    

Similar News