సమ్మె యధాతధమన్న జేఏసీ

ఆర్టీసీ సమ్మె తెలంగాణలో యధాతధంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. తాము సమ్మెను విరమిస్తామని ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో [more]

Update: 2019-11-22 07:29 GMT

ఆర్టీసీ సమ్మె తెలంగాణలో యధాతధంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. తాము సమ్మెను విరమిస్తామని ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రేపు డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టాలు రాలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్టీసీకి నష్టాలు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. డ్యూటీలు ఇవ్వాలంటూ ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కార్మికులను కోరారు. రేపు మరోసారి జేఏసీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని అశ్వద్ధామరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News