రోజా ప్రశ్నకు సమాధానం ఏదీ?

Update: 2018-12-02 12:10 GMT

తెలంగాణలో ఒకలాగా.... ఏపీలో ఒకలాగా మాట్లాడటం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తెలంగాణ ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ వీడిన ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని అభివృద్ధి చూసి వచ్చారనడం చూస్తే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదనిపిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు వెర్రివాళ్లు కాదని, ఆయనను తెలంగాణ ప్రజలు అక్కడి నుంచి తరిమి కొట్టాలని రోజా పిలుపునిచ్చారు. హరికృష్ణ కుటుంబం మీద అలివిమాలిన ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు ఆ కుటుంబంలో ఒకరిని ఏపీలో ఎందుకు మంత్రిని చేయలేదని ప్రశ్నించారు.

Similar News