కేవీపీ ఓటు తిరస్కరణ

రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఓటును తిరస్కరించారు. సూర్యాపేట పరిధిలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా కేవీపీ తన ఓటు హక్కును ఉపయోగించుకోవాలనుకున్నారు. అయితే ఎన్నికల [more]

Update: 2020-01-27 02:47 GMT

రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఓటును తిరస్కరించారు. సూర్యాపేట పరిధిలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా కేవీపీ తన ఓటు హక్కును ఉపయోగించుకోవాలనుకున్నారు. అయితే ఎన్నికల అధికారి కేవీపీ రామచంద్రరావు ఓటును తిరస్కరించారు. కేవీపీ రామచంద్రరావు తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు. అయితే కేవీపీ ఓటును తిరస్కరించడంతో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళనకు దిగారు. కేవీపీ ఓటును ఎలా తిరస్కరిస్తారో చెప్పాలంటూ ధర్నా చేశారు. కేవీపీ ఓటును అంగీకరిస్తే కాంగ్రెస్ గెలుస్తుందనే భావనతోనే తిరస్కరించారని ఉత్తమ్ ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News