మౌనం వీడిన రాహుల్

Update: 2018-05-17 06:29 GMT

కర్ణాటక ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చిన నాటి నుంచి మౌనంగా ఉన్న రాహుల్ ఎట్టకేలకు పెదవి విప్పారు. కర్ణాటకలో మెజారిటీ లేకున్నా అతిపెద్ద పార్టీగా ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించడం, యడ్యూరప్ప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ట్విట్టర్ లో ఆయన బీజేపీ పై విమర్శలు చేశారు. ‘‘ మెజారిటీ లేకున్నా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయడం అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఇవాళ కర్ణాటకలో బీజేపీ తమ అబద్దపు విజయం పట్ల సంబరాలు చేసుకుంటుంది. కానీ, ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని చూసి దేశం మొత్తం విచారిస్తుంది’’ అని ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

Similar News