రీడిజైన్ పై రాహుల్ ఫైర్

Update: 2018-11-29 08:32 GMT

17 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడితే ఇవాళ కేసీఆర్ పాలనలో రాష్ట్రం 2 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతీ కుటుంబంపై రెండున్నర లక్షల అప్పుభారం మోపారని ఆరోపించారు. గురువారం భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... రాష్ట్రంలో 4,500 రైతులు త్మహత్యలు చేసుకుంటే, ప్రభుత్వం ఆ కుటుంబాలను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. చుట్టు అటవీ భూమి ఉన్నా గిరిజనులు మాత్రం లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల దోపిడి జరిగిందని, కేసీఆర్ కుటుంబం, కాంట్రాక్టర్లు దీనివల్ల లబ్ధి పొందారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలోని అన్ని హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు.

Similar News