నేనెందుకు రాజీనామాలు చేయాలి.. పెయిడ్ ఆర్టిస్ట్ లు?

న్యాయస్థానాల్లో పిటీషన్ల పేరుతో ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రశ్నించడాన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. సోషల్ మీడయాలో వ్యతిరేక పోస్టులు [more]

Update: 2020-08-26 08:15 GMT

న్యాయస్థానాల్లో పిటీషన్ల పేరుతో ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రశ్నించడాన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. సోషల్ మీడయాలో వ్యతిరేక పోస్టులు పెడితే అరెస్ట్ లు చేస్తున్నారన్నారు. తనున మానసికంగా వేధిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సలహాదారులు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను రాజీనామా చేసినా మళ్లీ ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలవగలనని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. పెయిడ్ ఆర్టిస్టులకు భయపడి తాను రాజీనామా చేయాలా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. తాను జగన్ ను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. విధానాలను మాత్రమే తప్పుపట్టానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ నేరానికి పూర్తి కారణం జగన్ వెంట ఉన్న కోటరీదేనని తెలిపారు.

Tags:    

Similar News