బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న దేశ ప్రధాని

Update: 2018-10-13 07:46 GMT

తెలంగాణ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే ఉత్సవం బతుకమ్మ పండుగ. కేవలం తెలంగాణలోనే కాకుండా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు కూడా ప్రతీయేటా పండుగను నిర్వహించుకుంటున్నారు. ఇదేవిధంగా న్యూజిల్యాండ్ లో తెలంగాణవాసులు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో విశిష్ఠ అతిథి పాల్గొన్నారు. ఏకంగా న్యూజిల్యాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ పాల్గొన్నారు. తెలంగాణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. పండుగ విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. ఓ దేశ ప్రధాని బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, ఆమెకు ట్విట్టర్ ద్వారా తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

 

Similar News