ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన పోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే [more]

Update: 2019-04-11 12:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. ఉదయం ఈవీఎంలు పనిచేయడం లేదనే ప్రచారం జరిగినా పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు, చెదురుమొదురు సంఘటనలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 65 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఆరు గంటల వరకు క్యూ లైన్ లో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్ లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఓటర్లు వేచి ఉన్నారు. దీంతో మరో గంటలో మొత్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైందో తేలనుంది.

Tags:    

Similar News