పాదయాత్రకు అనుమతి....దిగొచ్చిన పోలీసులు

Update: 2018-06-09 10:07 GMT

రాజమహేంద్రవరంలో జగన్ పాదయాత్రకు పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీదుగా ఆయన రాజమండ్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే, బ్రిడ్రీ రెయిలింగ్ బలహీనంగా ఉన్నందున మొదట పోలీసులు ఈ బ్రిడ్జీపై పాదయాత్రకు అనుమతించలేదు. దీంతో పాటు కోటిపల్లి బస్ స్టాండ్ వద్ద కూడా బహిరంగ సభ నిర్వహిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నందున పోలీసులు అనుమతి నిరాకరించారు. వైసీపీ నేతలు ఉన్నతాధికారులను మరోసారి కలిసి పాదయాత్రకు అనుమతి కోరారు. అయితే, బ్రిడ్జీ రెయిలింగ్ బలహీనంగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీనే వాలంటీర్లను ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తూ జిల్లా ఎస్పీ జగన్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. దీంతో చారిత్రక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్. మీదుగానే ఈ నెల 12న జగన్ రాజమండ్రి చేరుకోనున్నారు. అయితే, ఇంతకుముందు విజయవాడలో పాదయాత్ర సమయంలో జగన్ తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో కృష్ణా నదిపై వంతెన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారధి ఊగిందన్న వార్తలు వచ్చాయి.

Similar News