జనసేన ప్రీ మ్యానిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..!

Update: 2018-08-14 08:06 GMT

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ప్రీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. విజన్ డాక్యుమెంట్ పేరుతో ఆయన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించారు. పూర్తి స్థాయి మ్యానిఫెస్టో ఎన్నికలకు ముందుకు విడుదల చేయనున్నారు.

వీటిలో ముఖ్యమైనవి...

- రేషన్ కు బదులు మహిళల ఖాతాలో రూ.2,500 - 3,000 నగదు జమ.

- ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం.

- మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు

- చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు

- బీసీలకు ఇంకా 5 శాతం రిజర్వేషన్లు పెంపు

- గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

- కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు

- ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్, విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహాలు

- ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు

Similar News