ఆత్మహత్యలకు బాధ్యత ప్రభుత్వానిదే

తెలంగాణలో ఇంటర్ ఫలితాల తర్వాత 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. [more]

Update: 2019-04-24 08:24 GMT

తెలంగాణలో ఇంటర్ ఫలితాల తర్వాత 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల భవిష్యత్ ను ఇంటర్ బోర్డు ఆగమ్యగోచరంగా మార్చడం దారుణమని ఆరోపించారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యువేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రతి దశపైనా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఇంటర్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేయడాన్ని ఖండించారు. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యువేషన్, రీవెరిఫికేషన్ చేయాలని కోరారు. జీవితం చాలా విలువైందని, ఈ ఫలితాలతో నిరాశచెంది ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ విద్యార్థులను కోరారు.

Tags:    

Similar News