అదే జరిగితే చర్యలు తప్పవు…నిమ్మగడ్డ వార్నింగ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. వైసీపీ అభ్యర్థులు వెయ్యి రూపాయల నగదును పంచుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ కార్యదర్శి [more]

Update: 2020-04-06 13:05 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. వైసీపీ అభ్యర్థులు వెయ్యి రూపాయల నగదును పంచుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ కార్యదర్శి రామకృష్ణలు రాసిన లేఖలపై ఆయన సీరియస్ అయ్యారు. అలాంటి సంఘటనలను అధికారులు చూసీ చూడనట్లు వదిలేయకూడదని తెలిపారు. దీనిపై దర్యాప్తు జరపాలని జిల్లా కలెక్టర్లకు రమేష్ కుమార్ ఆదేశించారు. ఏపీలో వైసీపీ అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చే వేయి రూపాయల నగదును పంచుతున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పై నిషేధం ఉందని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు.

Tags:    

Similar News