ఆ యాప్ రూపకల్పనలో ఎవరికీ సంబంధం లేదు

ఈ యాప్ రూపకల్పనలో ఎవరికీ సంబంధం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. యాప్ పై ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో పెద్ద ఆశ్చర్యపడలేదన్నారు. [more]

Update: 2021-02-03 07:33 GMT

ఈ యాప్ రూపకల్పనలో ఎవరికీ సంబంధం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. యాప్ పై ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో పెద్ద ఆశ్చర్యపడలేదన్నారు. వారి పని వారిది…తమ పని తమది అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఎవరైనా ఎస్ఈసీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపేందుకే యాప్ ను తీసుకొచ్చామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గతంలోనూ టెక్నాలజీని ఎన్నికల కోసం వాడామని చెప్పారు. ఫిర్యాదు పరిష్కారం అయిందా? లేదా? అన్నది కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటామని చెప్పారు. నిఘా య ాపై ఎస్ఈసీకి అపమ్మకం లేదన్నారు. ఎస్ఈసీ అవసరాల కోసమే ఈ యాప్ ను రూపొందించామని చెప్పారు. జిల్లాల్లో తాను నిరంతరం పర్యటిస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News