ఎన్నికలకు వాలంటీర్లు దూరంగా ఉండాల్సిందే… నిమ్మగడ్డ నిర్ణయం

వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎవరు అలక్ష్యం వహించినా సహించబోనని తెలిపారు. మొదటి [more]

Update: 2021-01-27 07:43 GMT

వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎవరు అలక్ష్యం వహించినా సహించబోనని తెలిపారు. మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలను తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు సహకరించకపోతే కేంద్ర బలగాలు దిగుతాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా యాప్ ను రూపొందించామని, ఎవరైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ఆగకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాలని కోరారు. గొడవలు, అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా ఎన్నికల కమిషన్ రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో నిమ్మగడ్డ ఈ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News