నేడు నిమ్మగడ్డ విషయంలో క్లారిటీ రానుందా?

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడే అవకాశముంది. ఇప్పటికే నిమ్మగడ్డ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలను ధర్మాసనం [more]

Update: 2020-05-08 04:46 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడే అవకాశముంది. ఇప్పటికే నిమ్మగడ్డ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలను ధర్మాసనం వినింది. పిటీషనర్ల తరుపున న్యాయవాదులు తమ వాదనను విన్పించారు. నిన్న అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరించారు. తాము నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించలేదని ఏజీ హైకోర్టుకు స్పష్టం చేశారు. దీంతో హైకోర్టు ధర్మాసనం కేసు విచారణను నేటికి వాయిదా వేసింది. ఇరువర్గాల వాదనలను పూర్తయినందున ఈరోజు తీర్పు వెలువడే అవకాశముందని తెలిసింది.

Tags:    

Similar News