నిమ్మగడ్డపై నేడే.. సర్వత్రా ఉత్కంఠ

రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిమ్మగడ్డతో పాటు మరికొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. [more]

Update: 2020-04-28 02:36 GMT

రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిమ్మగడ్డతో పాటు మరికొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కౌంటర్ కూడా వచ్చింది. అలాగే ప్రస్తుత ఎన్నికల కమిషనర్ కనగరాజ్ కూడా హైకోర్టులో కౌంటర్ వేశారు. నేడు హైకోర్టులో దీనిపై విచారణ జరిగిన తర్వాత తీర్పు వెలువడే అవకాశముంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో కొనసాగుతారా? లేదా? అన్నది నేడు తేలనుంది. కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు తుది నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ధర్మాసనం గతంలో పేర్కొంది.

Tags:    

Similar News