చైనాకు మోదీ ఘాటు వార్నింగ్

దేశం నలుదిక్కుల నుంచి భారత్ ను రక్షిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ప్రశింసించారు. మోదీ లడ్హాఖ‌్ లో పర్యటించి సైనికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. మీ సేవలను దేశం [more]

Update: 2020-07-03 08:53 GMT

దేశం నలుదిక్కుల నుంచి భారత్ ను రక్షిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ప్రశింసించారు. మోదీ లడ్హాఖ‌్ లో పర్యటించి సైనికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. మీ సేవలను దేశం ఎప్పుడూ మరచిపోదన్నారు. దేశ సరిహద్దులను సమర్థవంతంగా, ధైర్యంగా కాపాడుతున్నారని మోదీ కొనియాడారు. సైనికుల ధైర్యసాహసాలు అజరామరమని చెప్పారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న మీ రుణం తీర్చుకోలేనిదని మోదీ అన్నారు. యుద్ధ భూమిలో ఉన్న మీరే మాకు ప్రేరణ అని మోదీ చెప్పారు. భారతమాత శత్రువులు మీ పరాక్రమాన్ని రుచి చూశారన్నారు. సైనికుల ధైర్యసాహసాలు పర్వతాల తరహాలోనే ధృఢమైనవని చెప్పారు. శత్రువులు మీ కళ్లలో ధైర్యం చూసి భయపడుతున్నారన్నారు. గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన సైనికులుకు మోదీ మరోసారి శ్రద్ధాంజలి ఘటించారు. లేహ్, లడ్హాఖ్ భారత్ లో అంతర్భాగమని, వాటిని భారత్ నుంచి ఎవరూ వేరు చేయలేరని మోదీ పరోక్షంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రపంచ శాంతి కోసం తొలుత ప్రయత్నిస్తామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News