బాబు పేరు మారుస్తున్నారా...?

Update: 2018-11-17 02:10 GMT

F1H2o ఎన్టీఆర్ సాగర్....బెజవాడ దుర్గ గుడి..., ప్రకాశం బ్యారేజ్.... భవాని ఐలాండ్..... కృష్ణా నది......ఆగండి ఆగండి..... కృష్ణా నది పేరు ఇక ఉండదు..... కృష్ణా నది పేరు మార్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు యూనియన్ ఇంటర్నేషనల్ మోటో నాటిక్ ప్రతినిధులకు హామీ ఇచ్చేశారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువున నిండు కుండల ఏడాది పొడవునా జనాలకు కనువిందు చేసే కృష్ణమ్మ పేరు మోటుగా, మొరటుగా ఉందని భావించి దానికి బాబు గారు కొత్త పేరు పెట్టారు.

రెండు ఆప్షన్స్......

రెండు ఆప్షన్స్ కూడా జనాలకు ఇచ్చారు. మొదటిది F1H20 ఎన్టీఆర్ సాగర్., రెండోది ఎఫ్1హెచ్ 2ఓ ఎన్టీఆర్ సాగర్, అమరావతి.... రెండింటిలో ఎదో ఒకటి మాత్రం ఫిక్స్... ఇకపై ఏటా నవంబర్ లో ఫార్ములా వన్ పవర్ బోట్ రేస్ కి విజయవాడ ఆతిథ్యం ఇస్తుంది అని, అందుకోసం బ్యారేజ్ ఎగువున కృష్ణా నదికి పేరు కూడా పెడుతున్నట్లు ప్రకటించేశారు. నోరు తిరగకపోయినా జనం మాత్రం ఇకపై కృష్ణా నదిని అలా పిలవాల్సిందే.

Similar News