వైసీపీ తరుపున వకాల్తా పుచ్చుకున్నారా?

కేటీఆర్ ముందు తెలంగాణ అభివృద్ధి చూసుకోవాలని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సూచించారు. ఏపీలో జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆనంద్ [more]

Update: 2019-02-23 13:49 GMT

కేటీఆర్ ముందు తెలంగాణ అభివృద్ధి చూసుకోవాలని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సూచించారు. ఏపీలో జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆనంద్ బాబు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రొచ్చగొట్టి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, టీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టోలో 10 శాతం కూడా అమలు చేయలేదన్నారు. డబ్బుందనే అహంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని, వైసీపీ తరుపున ఆయన వకల్తా పుచ్చుకున్నారని ఆరోపించారు. ఏపీకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయనడానికి కేటీఆర్ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అని, టీడీపీ తెలుగువాళ్ల పార్టీ అన్నారు. ఎన్నికల ముందు జగన్ లండన్ వెళ్లడం కూడా కుట్రలో భాగమే అని పేర్కొన్నారు.

Tags:    

Similar News