వై.ఎస్. జగన్ ను కలిసిన డైరెక్టర్

Update: 2018-12-20 12:28 GMT

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమాను తెరకెక్కిస్తున్న మహి వి రాఘవ్ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ ను కలిశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఆయన కలిశారు. జగన్ తో కలిసి కొంతసేపు నడిచారు. యాత్ర సినిమా విశేషాలను జగన్ తో పంచుకున్నారు. ఇక, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమా వెనుక జగన్ ఉన్నారనే ఆరోపణలను ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఖండించారు. ఈ చిత్రంలోని ‘వెన్నుపోటు’ పాటను రేపు విడుదల చేయనుండగా... రేపు జగన్ పుట్టినరోజు అయినందునే వర్మ ఈ పాటను రేపు విడుదల చేస్తున్నారని పలువురు ఆరోపణలు చేశారు. దీనిని ఖండించిన లక్ష్మీపార్వతి... బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ కూడా రేపే ఉంది కదా.. మరి, బాలకృష్ణ... జగన్ పుట్టినరోజు సందర్భంగానే ఈ కార్యక్రమం చేస్తున్నారా అని ప్రశ్నించారు.

Similar News