మోత్కుపల్లికి ఇక వెంకన్నే దిక్కా?

Update: 2018-07-10 11:11 GMT

సుధీర్ఘకాలం తెలుగుదేశంలో పనిచేసిన ఇటీవలే బహిష్కరణకు గురైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఇప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ లోనే తేల్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రకటించిన విధంగా తిరుపతికి వెళుతున్నారు. ఆయన రేపు ఉదయం తిరుపతి చేరుకుని అలిపిరి నుంచి కాలి నడకన తిరుమల వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళితులు, బలహీనవర్గాలకు చంద్రబాబు వ్యతిరేకి అని, ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యతిరేక శక్తులన్నీ ఏకమై రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానన, తన 64వ పుట్టినరోజున తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను, తనకు జరిగిన అన్యాయాన్ని ఆ దేవుడితో చెప్పుకునేందుకే తిరుమల వెళుతున్నట్లు తెలిపారు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని ఆయన పేర్కొన్నారు. 12వ తేదీ తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి అన్ని విషయాలూ మాట్లాడతానని వివరించారు.

Similar News