బ్రేకింగ్ : నోటిఫికేషన్ విడుదల… ఎన్నికల కోడ్ అమల్లోకి

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ జారీ అయింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేశారు. దీంతో రాష్ట్ర [more]

Update: 2020-03-07 06:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ జారీ అయింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఈక్షణం నుంచే అమలులోకి రానుంది. మొత్తం మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే దఫా నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27, 29 వతేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 21వ తేదీన జరగున్నాయి. ఎలాంటి కొత్త పథకాలను ప్రారంబించకూడదని రమేష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News