కోటి ఇస్తే...కుల్దీప్ సేఫ్

Update: 2018-05-11 11:53 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఉన్నావ్‌’ సామూహిక అత్యాచారం కేసును అవకాశంగా తీసుకుని మోసం చేద్దామని ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచార ఘటనలో నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ను కేసు నుంచి తప్పిస్తామని అతని భార్య సంగీతను బోల్తా కొట్టిద్దామనుకునే చివరకు, కథ అడ్డం తీరగడంతో ఊచలు లెక్కబెడుతున్నారు. తాము బీజేపీ నాయకులమని, సీబీఐ అధికారులమని నమ్మించి రూ.కోటి ఇస్తే నీ భర్తను బయటకు తీసుకొస్తామని బేరానికి దిగారు. లక్నోకు చెందిన అలోక్‌, విజయ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కథంతా నడిపారు. ఈ డబ్బుల పాపం తమది కాదని, సీబీఐ అధికారికి లంచం ఇవ్వడానికే అడుగుతున్నామని చెప్పారు.దీంతో తన వద్ద అంత డబ్బు లేదని సంగీత చెప్పగా, కనీసం 50 లక్షలైనా ఇవ్వాలని చెప్పారు.

నేను రాజీవ్ మిశ్రాను....

సీబీఐ అధికారి రాజీవ్ మిశ్రాగా పరిచయం చేసుకుని తరువాతి రోజు మరోవ్యక్తి ఫోన్ చేశాడు. రూ.కోటి ఇస్తే కుల్దీప్ బయటకు వస్తాడని ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు తాను సీబీఐ అధికారిగా నమ్మకం కుదరకపోతే లక్నోలోని సీబీఐ కార్యాలయానికి వచ్చి చూడవచ్చని చెప్పాడు. ఫోన్ల విషయం సంగీత తన బంధువులకు చెప్పడంతో వారి సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నకీలీలు అలోక్, విజయ్ లను అరెస్టు చేశారు.

Similar News