కోమటిరెడ్డిపై వేటు తప్పదా?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పేట్లు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో చేసిన ప్రసంగం వింటే ఇదే అర్థమవుతోంది. అసెంబ్లీ సమాశాల్లో గవర్నర్ ప్రసంగానికి [more]

Update: 2020-03-07 12:48 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పేట్లు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో చేసిన ప్రసంగం వింటే ఇదే అర్థమవుతోంది. అసెంబ్లీ సమాశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతుండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే అడ్డుకున్నారు. అంతకు ముందు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు కురపించారు. తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చారంటూ దుయ్యబట్టారు. అయితే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత ప్రసంగించిన కేసీఆర్ ఇటువంటి సభ్యుల విషయంలో ఉపేక్షించవద్దని స్పీకర్ ను కోరారు. కఠిన చర్యలుంటే తప్ప దారికి రారని సూచించారు. ఇదే విషయంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి తర్వాత మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తప్పదేమోనని, ఈసారి తాము ఖచ్చితంగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది.

Tags:    

Similar News