బాబు సీట్లిచ్చినా ఈసారి ఎవరూ గెలవరు..డబ్బులు బొక్క

పారిపోవడం అనేది చంద్రబాబుకు తెలిసినంత ఎవరికీ తెలియదని మంత్రి కొడాలి నాని అన్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పారిపోయారన్నారు. చంద్రగిరి నుంచి కుప్పంకు పారిపోయారని, హైదరాబాద్ [more]

Update: 2020-12-03 05:51 GMT

పారిపోవడం అనేది చంద్రబాబుకు తెలిసినంత ఎవరికీ తెలియదని మంత్రి కొడాలి నాని అన్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పారిపోయారన్నారు. చంద్రగిరి నుంచి కుప్పంకు పారిపోయారని, హైదరాబాద్ రాజధానిని వదిలి విజయవాడ పారిపోయారని, ఇప్పుడు కరోనాతో కాల్వగట్టు నుంచి హైదరాబాద్ కు మళ్లీ పారిపోయారని కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు తమ అధినేత జగన్ పారిపోయారనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసారి చంద్రబాబు ఎవరికీ టిక్కెట్లు ఇచ్చినా గెలవరని, డబ్బులు బొక్క అని కొడాలి నాని అన్నారు. ఇంతగా దిగజారే నేత మరెవరూ లేరన్నారు. జగన్, రాజశేఖర్ రెడ్డిల రక్తం లోనే పారిపోవడం అనేది లేదన్నారు. ఫేక్ ముఖ్యమంత్రి అంటే ఏంటని కొడాలి నాని అని నిలదీశారు. పార్టీని, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రతిపక్షనేత అని, ఫేక్ టీడీపీ అని కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

Tags:    

Similar News