బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి కేఈ రాజీనామా…లేఖలో ఏముందంటే?

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు తెలుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న [more]

Update: 2020-03-13 07:06 GMT

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు తెలుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేఈ ప్రభాకర్ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు టీడీపీలో న్యాయం జరగడం లేదని, టీడీపీ వాళ్లకే కర్నూలు కార్పొరేషన్ టిక్కెట్లు రాలేదని, ఇతర పార్టీల వాళ్లకు వచ్చాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఆయన టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ గుర్తింపు కార్డును కూడా కేంద్ర కార్యాలయానికి పంపారు. తన రాజకీయ నిర్ణయాన్ని కాసేపట్లో ప్రకటిస్తానని కేఈ ప్రభాకర్ తెలిపారు.

Tags:    

Similar News