వైఎస్ పై ఫైరయిన కేసీఆర్..!

Update: 2018-10-05 12:47 GMT

తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రి పదవుల కోసం సమైక్య పాలకులకు గులాంగిరి చేశారని, ఇప్పుడు కూడా ఢిల్లీకి, ఆంధ్రకు గులాంలుగా ఉన్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోపించారు. శుక్రవారం వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకుల బండారాన్ని ప్రజల్లోనే బయటపెడాతమన్నారు. డీకే అరుణ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. పోతిరెడ్డిపాడుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్రమంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే చిన్నారెడ్డి సమర్థిస్తూ వ్యాసాలు రాశారని, డీకే అరుణ మంగళహారతి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలను నీళ్లు ఇచ్చామని, మరో 12 లక్షల ఎకరాలకు కూడా నీరు ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. మహబూబ్ నగర్ లోని 14 స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లిస్తేనే మరోసారి ఓట్లు అడుగుతానని శపథం చేశారు. తొమ్మిదేళ్లు పాలమూరును దత్తత తీసుకుని శిలాఫలకాలు తప్ప పనులు చేయని దుర్మార్గుడు చంద్రబాబు అని అన్నారు. అటువంటి చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇద్దామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అభివృద్ధి ఆగిపోవద్దన్నా.. తెలంగాణ ఆత్మగౌరవంతో ఉండాలన్నా టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.

Similar News