ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతితో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో 2019-2020కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఫిబ్రవరిలో [more]

Update: 2019-09-09 07:33 GMT

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతితో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో 2019-2020కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఫిబ్రవరిలో ఉభయసభలు ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ పద్దు గడువు సెప్టెంబర్ 30న ముగిసింది. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను తెస్తుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు.

Tags:    

Similar News